Breaking News

వృత్తి పోలీసు.. హాబీ మాత్రం: ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Mon, 07/14/2025 - 12:29

డిచ్‌పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో గుట్ట గంగాధర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గంగాధర్‌ భార్య త్రివేణి గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇద్దరికీ స్టాంపులు, నాణేలు, కరెన్సీల సేకరణ అంటే ఇష్టం. ఈ దంపతుల కుటుంబ సభ్యులలో పలువురు విదేశాలకు వలస వెళ్లారు. వారి ద్వారా అక్కడి దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. 

అలాగే స్నేహితులు, తెలిసిన వారి ద్వారా వివిధ దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. ఇలా 2003 నుంచి 23 దేశాల నాణేలు, కరెన్సీతో పాటు 25 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. సేకరించిన నాణేలలో కాకతీయుల కాలంతో పాటు 1939 సంవత్సరం నిజాం కాలం నాటి నాణేలు, రూపాయలు ఉన్నాయి. వీరు సేకరించిన నాణేలు, కరెన్సీలలో భారతదేశంతో పాటు యూఎస్‌ఏ, యూకే, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, జోర్డాన్, టర్కీ, ఇటలీ, పొలాండ్, ఫిలిఫ్సీన్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇండోనే షియా, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి. 

ఇదీ చదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!

స్టాంపులలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యూఎస్‌ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ, మాల్టా, సింగపూర్, ఈజిఫ్ట్, ఫిలిఫ్పిన్స్, ఇటలీ తదితర దేశాలవి ఉన్నాయి. వీటి సేకరణ కోసం గంగాధర్‌ దంపతులు చాలా మంది వ్యక్తులను కలిశారు. పోలీసు ఉద్యోగం రాకముందు గంగాధర్‌ కూడా ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ప్రైవేట్‌ టీచర్‌గా పని చేశారు. అప్పుడే ఆయనకు ఈ సేకరణపై ఇష్టం ఏర్పడింది. గత చరిత్ర, పాలకుల వైభవాలకు గుర్తు అయిన కాకతీయ, నిజాం కాలం నాటి నాణేల సేకరణతో మొదలు పెట్టాడు. ప్రస్తుతం తమ ఇంటికి ట్యూషన్‌కు వచ్చే బాల, బాలికలకు వీటి గురించి వివరిస్తారు.

Videos

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

జగన్ బాబుకు కవిన్ అని పేరు పెట్టారు

YSRCP కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు

శుభాంశు వచ్చేశాడు..

Ambati Murali: కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరిస్తోంది

కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట

ఉప్పల హారిక పై దాడి.. విజయవాడలో మహిళలు భారీ నిరసన

Katari Eswar Kumar: మీ సతీమణికే ఆత్మాభిమానం ఉంటుందా?

ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అని తిట్టిన మాధవిరెడ్డి

చేతకాని హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

Photos

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)