సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
Breaking News
వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్
Published on Sat, 07/12/2025 - 08:40
వాణిజ్య బీమా విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ప్రైవేట్ రంగ జ్యూరిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ అలోక్ అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీన్ని సరికొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సంబంధించి మొత్తం బీమా వ్యాపారంలో సుమారు 3 శాతంగా ఉన్న ఈ విభాగం వాటాను వచ్చే 2–3 సంవత్సరాల్లో 15–20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి బడా కార్పొరేట్లు, స్పెషలైజ్డ్ పరిశ్రమల వరకు వివిధ రంగాలకు అనువైన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటికే ఓ కార్యాలయం ఉండగా త్వరలో వైజాగ్‌లో కూడా ఒకటి ప్రారంభిస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమాను విస్తరించేలా స్వల్ప ప్రీమియం, ఒక మోస్తరు సమ్ ఇన్సూర్డ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాహన బీమా పాలసీల విక్రయాలు రెండు దశాబ్దాల పాటు సుమారు 13–17 శాతం వరకు వృద్ధి చెందినప్పటికీ, వాహన విక్రయాలు కొంత నెమ్మదించడం వంటి అంశాల కారణంగా గతేడాది ఆరు శాతానికి పరిమితం అయ్యాయని చెప్పారు. ఇవి క్రమంగా మళ్లీ పుంజుకోగలవని చెప్పారు.
Tags : 1