Breaking News

ఇక దేశీయంగా  రేర్‌ మాగ్నెట్స్‌ ఉత్పత్తి

Published on Sat, 07/12/2025 - 04:11

న్యూఢిల్లీ: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,345 కోట్ల స్కీముపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మాగ్నెట్స్‌ తయారీ కోసం ఎంపికయ్యే రెండు సంస్థలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ విషయాలు వెల్లడించారు. 

చర్చలు పూర్తయ్యాక ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. రేర్‌ ఎర్త్‌ ఆక్సైడ్‌లను మాగ్నెట్ల కింద మార్చే ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సబ్సిడీలు ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాగ్నెట్స్‌ ఎగుమతులపై ప్రధాన సరఫరాదారు అయిన చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్న సంగతి తెలిసిందే. టెలికం, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ తదితర రంగాల్లో ఉత్పత్తికి ఇవి కీలకంగా ఉంటాయి.  

ఎలక్ట్రిక్‌ ట్రక్కులకు స్కీము.. 
పీఎం ఈ–డ్రైవ్‌ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్‌ ట్రక్కులు కొనుగోలు చేసే వారికి రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్‌ ఇచ్చే పథకాన్ని కుమారస్వామి ఆవిష్కరించారు. సుమారు 5,600 ట్రక్కులకు వర్తించే ఈ పథకంతో పోర్ట్‌లు, లాజిస్టిక్స్, సిమెంట్, స్టీల్‌ తదితర పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం వాహనాల్లో డీజిల్‌ ట్రక్కుల వాటా 3 శాతమే అయినప్పటికీ రవాణా సంబంధిత గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాల్లో 42 శాతం వాటా వాటిదే ఉంటోందని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్గారాలను తగ్గించే, పర్యావరణహితమైన సరకు రవాణా విధానాలను అమలు చేసేందుకు ఈ స్కీము దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్‌ పరిమాణం రూ. 10,900 కోట్లు కాగా, ఇందులో ఎలక్ట్రిక్‌ ట్రక్కుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు.  
 

Videos

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు

అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే

YSRCP ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాద్ లో భారీ వర్షం

రాబర్డ్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలుచేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ

పదేళ్లు సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలకు దూరంగా కేసీఆర్ పాలన చేశారు

భాను ప్రకాష్... వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: వరుదు కల్యాణి

రోజాపై భాను గాలి ప్రకాష్ వ్యాఖ్యలు YSRCP పూర్ణమ్మ ఉగ్రరూపం..

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)