Breaking News

ఏఐ ఆధారిత వైద్య సేవలు 

Published on Sat, 07/12/2025 - 04:00

ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ప్రకటించారు. భారత్‌లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్‌ మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ – ఆసియా పసిఫిక్‌ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్‌–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్‌ అదానీ మాట్లాడారు.

 భవిష్యత్‌ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్‌నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్‌కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్‌కేర్‌ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు.

 ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ క్యాంపస్‌లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్‌ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని  అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.

నచ్చిన చిత్రం మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ 
‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్‌ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు.   

Videos

పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు

భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన

ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు

శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి

YS Jagan Tweet: శభాష్ శుభాంశు..

Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..

ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం

ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు

Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

Photos

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)