TV5, మహా న్యూస్, ఈనాడు.. పాత్రికేయ ముసుగులో పచ్చ వ్యభిచారం
Breaking News
గదాధారి...
Published on Sat, 07/12/2025 - 00:21
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్‌ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు.
Tags : 1