తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత
Breaking News
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
Published on Fri, 07/11/2025 - 13:09
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు.
ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్‌కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.

అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..
అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు.
బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..
మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్‌లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు.
పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..
రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.
భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..
తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.

హానికరమైన అలవాట్లకు దూరం..
ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్‌లు, అధిక పోషకాహార డైట్‌లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు.
దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.
ఉరకలు వేసే ఉత్సాహం..
దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు.
అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్‌గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...
(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!)
Tags : 1