గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
Breaking News
'నయనతార'ను వదలని చంద్రముఖి
Published on Tue, 07/08/2025 - 09:41
నటి నయనతార (Nayanthara) డాక్యుమెంటరీపై ధనుష్ వేసిన పరువునష్టం దావా కేసు మద్రాస్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలో అదే డాక్యుమెంటరీలో 'చంద్రముఖి' సీన్స్ తొలగించాలని న్యాయస్తానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ, నెట్‌ఫ్లిక్స్ జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నయనతార జీవితకథతో పాటు డైరక్టర్ విఘ్నేశ్ శివన్‌తో వివాహ వేడుకలపై 'నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్'(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది.
నయనతార డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. ధనుష్ పిటిషన్‌ను సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ కూడా ఓ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు దాన్ని కొట్టిపారేసింది. ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార డాక్యుమెంటరీపై మరో పిటిషన్ దాఖలు అయింది. చంద్రముఖి సినిమాలోని కొన్ని సీన్స్ తమ అనుమతి లేకుండా ఉపయోగించారని ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. అందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీనిపై రెండు వారాల్లో జవాబివ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు మద్రాస్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Tags : 1