Breaking News

పసిడికి కొనుగోళ్ల కళ

Published on Wed, 07/02/2025 - 01:16

న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బలమైన సానుకూలతల అండతో స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో పసిడి మంగళవారం ఒక్క రోజే రూ.1,200 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.98,670కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150 స్థాయిని తాకింది. వెండి సైతం కిలోకి రూ.2,000 లాభపడి రూ.1,04,800కు చేరుకుంది.

డాలర్‌ బలహీనత కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్‌ ఏర్పడినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ జతీన్‌ త్రివేది తెలిపారు. అమెరికా ఆర్థిక గణాంకాలపై అంచనాలతో ఈ వారం పసిడి పట్ల సెంటిమెంట్‌ సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం 3,362 డాలర్ల స్థాయికి పుంజుకుంది. ‘‘డాలర్‌ బలహీనపడడం, అమెరికా ద్రవ్యలోటు విస్తరణపై ఆందోళనలతో.. ట్రంప్‌ ప్రతిపాదిత పన్ను తగ్గింపుల బిల్లుపై మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో బంగారం ఆకర్షణీయంగా మారింది’’అని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా తెలిపారు.

#

Tags : 1

Videos

బంగారంపై ఇప్పుడు పెట్టుబడి పడితే నష్టమా?

Nallapareddy Prasannakumar: ఇది నల్లపరెడ్డి బ్లడ్.. భయపడే ప్రసక్తే లేదు

తెలంగాణ లేకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం

చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం

CANADA: కేరళకు చెందిన స్టూడెంట్ పైలట్ శ్రీహరి సుకేశ్ మృతి

ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు

మామిడి రైతులపై అచ్చెన్నాయుడు అబద్దాలు ఏకిపారేసిన పెద్ది రెడ్డి..

మా కార్యకర్తలపై చేయి వేస్తారా... వాసుపల్లి గణేష్ స్ట్రాంగ్ వార్నింగ్..

కూటమి సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ భీమిలి YSRCP సమన్వయకర్త

ఒక కేసు పెడితే మూడు కేసులు పెడతాం.. టీడీపీకి దిమ్మతిరిగే వార్నింగ్

Photos

+5

విష్ణువిశాల్- గుత్తా జ్వాలా కూతురి నామకరణ వేడుక (ఫోటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో అక్కినేనివారి కోడలు శోభిత (ఫోటోలు)

+5

కాశీలో యాంకర్ రష్మీ గౌతమ్ ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

ప్చ్‌.. బాహుబలినే వదులుకున్న స్టార్లు వీళ్లే (ఫోటోలు)

+5

టెన్త్‌ క్లాస్‌కే హీరోయిన్‌.. స్విమ్మింగ్‌ రాకపోయినా దూకేసింది (ఫోటోలు)

+5

పనికి రాదని చెప్పినా పట్టించుకోలేదు (చిత్రాలు)

+5

బంగారుపాళ్యంలో పారని పన్నాగం.. జగన్‌ కోసం మహా 'ప్రభం'జనం (చిత్రాలు)

+5

భక్తిధామం షిర్డీలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలు..!

+5

చీర కట్టులో జోష్‌ పెంచిన ఇస్మార్ట్‌ బ్యూటీ 'నభా నటేష్' (ఫోటోలు)

+5

వేడి వేడి కాఫీ...సైన్స్‌ ఏం చెబుతోంది? (ఫొటోలు)