Breaking News

డియర్‌ స్టాఫ్‌.. ఆరోగ్యం జాగ్రత్త!

Published on Tue, 07/01/2025 - 19:21

ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఈమెయిళ్లు పంపుతోంది. పని గంటలకు మించి వర్క్‌ చేయకూడదని చెబుతూ వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై దృష్టి సారించాలని పేర్కొంటోంది. రిమోట్‌గా పని చేస్తోన్న కంపెనీ ఉద్యోగులు తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్‌మేరకే వర్క్‌ చేయాలని కోరుతోంది. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపుతోంది. కంపెనీకి చెందిన టూల్స్‌లో తమ ఉద్యోగులు గడిపే సమయాన్ని సైతం ట్రాక్ చేస్తూ రిమైండర్‌ పంపుతుంది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ హెచ్ఆర్ బృందం వారానికి ఐదు రోజులు, రోజుకు సగటున 9.15 పని గంటలు మించిన ఉద్యోగులకు హెల్త్ రిమైండర్ ఈమెయిల్స్ పంపుతోంది. ఈ ఈమెయిల్స్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని హైలైట్ చేస్తున్నాయి. రిమోట్‌గా పనిచేసేటప్పుడు నిర్ణీత పని గంటలను అధిగమించకుండా చూసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ సమతుల్యతను నిర్వహించాలని ఈమెయిల్స్‌లో స్పష్టమైన రిమైండర్‌ ఉన్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.

వృత్తిపరంగా చాలా అవసరం..

వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వృత్తిపరమైన ప్రభావానికి కూడా ఇది చాలా అవసరమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పనిఒత్తిడి ఉంటే వెంటనే తెలియజేయాలని, ఉద్యోగులు తమను తాము రిఫ్రెష్‌ కావడానికి వీలు కల్పించుకోవాలని తెలిపింది.

ఇదీ చదవండి: ‘సూపర్‌ యాప్‌’లో అన్ని రైల్వే సేవలు

గతంలో వారానికి 70 గంటలపాటు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కంపెనీలో ఇలా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు సంబంధించిన ఈమెయిళ్లు పంపడం ఉద్యోగుల్లో ఊరటనిస్తుంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌తోపాటు ఉద్యోగుల ఆరోగ్యంపట్ల కంపెనీ తీరును ఇవి హైలైట్‌ చేస్తున్నాయి.

Videos

తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు

మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ..!

ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై

వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ

రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

Photos

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)