Breaking News

అనిల్‌ అంబానీ మరో భారీ అడుగు..

Published on Tue, 07/01/2025 - 12:37

సుమారు రూ. 20,000 కోట్ల భారతీయ డిఫెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) మార్కెట్‌లో విస్తరణపై రిలయన్స్‌ డిఫెన్స్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన కోస్టల్‌ మెకానిక్స్‌తో చేతులు కలిపింది. భారతీయ సాయుధ బలగాలకు అవసరమైన ఎంఆర్‌వో, అప్‌గ్రేడ్, లైఫ్‌సైకిల్‌ సపోర్ట్‌ సొల్యూషన్స్‌ను అందించడంపై ఫోకస్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ డిఫెన్స్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది.

100కు పైగా జాగ్వార్‌ ఫైటర్‌ విమానాలు, 100 పైచిలుకు మిగ్‌–29 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అపాచీ ఎటాక్‌ హెలికాప్టర్లు, ఎల్‌–70 ఎయిర్‌ డిఫెన్స్‌ గన్‌లు మొదలైన వాటి ఆధునీకరణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. డీల్‌ ప్రకారం భారత్‌తో పాటు ఎగుమతి మార్కెట్లలోని క్లయింట్లకు సేవలు అందించేందుకు రిలయన్స్‌ డిఫెన్స్, కోస్టల్‌ మెకానిక్స్‌ కలిసి మహారాష్ట్రలో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తాయి.

దీనితో సాయుధ బలగాలు ఉపయోగించే గగనతల, భూతల డిఫెన్స్‌ ప్లాట్‌ఫాంల నిర్వహణ, అప్‌గ్రేడ్‌ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. 1975లో ఏర్పాటైన కోస్టల్‌ మెకానిక్స్‌కు అమెరికా ఎయిర్‌ఫోర్స్, ఆరీ్మకి కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. 

Videos

తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు

మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ..!

ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై

వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ

రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

Photos

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)