Breaking News

ఈ బ్యాంకుల్లో ఎల్‌ఐసీ పాలసీలు

Published on Tue, 07/01/2025 - 11:24

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ) తెలిపింది. దీని ప్రకారం ఎల్‌ఐసీ టర్మ్‌ పాలసీలు, ఎండోమెంట్‌ ప్లాన్లు, హోల్‌ లైఫ్‌ పాలసీలు మొదలైన వాటిని తమ శాఖల్లో విక్రయించనున్నట్లు పేర్కొంది.

21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమకు 2,456 పైగా బ్యాంకింగ్‌ టచ్‌పాయింట్లు ఉన్నట్లు బ్యాంక్‌ ఈడీ ఉత్తమ్‌ టిబ్రెవాల్‌ తెలిపారు. ఈ ఒప్పందంతో ఓవైపు బ్యాంకింగ్, బీమా, దీర్ఘకాలిక ఆర్థిక ప్లానింగ్‌ సొల్యూషన్స్‌ అన్నింటినీ ఒకే  దగ్గర అందించే సంస్థగా తమ బ్యాంక్‌ స్థానం పటిష్టమవుతుందని మరోవైపు గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాల్లో ఎల్‌ఐసీ పాలసీల విస్తృతి మరింతగా పెరుగుతుందని వివరించారు. 

బ్యాంకింగ్, భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ఒకే ప్లాట్ఫామ్ కింద సమీకృతం చేస్తూ, పూర్తి-స్పెక్ట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా  మారడానికి ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సాగిస్తున్న ప్రయాణంలో ఈ సహకారం ఒక మైలురాయిని సూచిస్తుంది. ఎల్ఐసీకి కూడా ఈ భాగస్వామ్యం విశ్వసనీయమైన,  కస్టమర్-సెంట్రిక్ బ్యాంకింగ్ భాగస్వామి ద్వారా విస్తృత పరిధిని అందిస్తుంది.

సంజయ్ అగర్వాల్ 1996లో స్థాపించిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా పనిచేస్తుంది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ 1.13 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది. బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ .1.57 లక్షల కోట్లు. 'ఎఎ /స్టేబుల్‌' క్రెడిట్ రేటింగ్‌ ఈ బ్యాంకుకు ఉంది.

Videos

తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు

మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ..!

ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై

వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ

రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

Photos

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)