Breaking News

ఇంటర్‌ తర్వాత వాట్‌ నెక్స్ట్‌..? టెన్షన్‌ వద్దు..

Published on Sun, 06/01/2025 - 16:44

ఇంటర్మీడియట్‌ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్‌– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్‌ రకరకాల సలహాలిస్తుంటారు. 

‘‘ఇంజినీరింగ్‌ చెయ్, ఫ్యూచర్‌ బాగుంటుంది.’’
‘‘నీట్‌ రాయి, ఎంబీబీఎస్‌ అయిపోతే జీవితం సెట్‌ అవుతుంది.’’
‘‘బీకామ్‌ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’
ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.

మీ మనసేం చెప్తోంది? 
ఇంటర్‌ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్‌ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్‌ కౌన్సెలింగ్‌ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. 

కొత్త దారిలో నడవండి...
ఇంటర్‌ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. 

బైపీసీ తర్వాత మెడిసిన్‌ తప్ప మరేం చేసినా వేస్ట్‌. 

బైపీసీ తర్వాత మెడిసిన్‌ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్‌ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్‌ సైన్స్‌, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్‌లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. 

ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!
ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్‌ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్‌ (ఎన్‌డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్‌ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

కామర్స్‌ అంటే సీఏ తప్ప దారిలేదు
కామర్స్‌ స్ట్రీమ్‌లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్‌ టెక్, బిజినెస్‌ అనలిటిక్స్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్‌ ఇప్పుడు కామర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. 
ఆర్ట్స్‌ తీసుకుంటే స్కోప్‌ ఉండదు.. 

ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్‌ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్‌ పాలసీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, మీడియా, కాగ్నిటివ్‌ సైన్స్‌ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. 

దారి చూపించే మూడు ప్రశ్నలు...
ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్‌ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. 
అది మీకు ప్యాషన్‌ కలిగించాలి.
అది మీకు పర్పస్‌ నేర్పించాలి.
అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.

అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. 

  • నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్‌. 

  • నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. 

  • నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్‌. 

ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్‌ అండ్‌ అవేర్‌నెస్‌ + స్కిల్‌ అండ్‌ మ్యాపింగ్‌ + ఫ్యూచర్‌ విజన్‌= రైట్‌ కెరీర్‌. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్‌ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్‌ యూ ఆల్‌ ద బెస్ట్‌!
సైకాలజిస్ట్‌ విశేష్‌
www.psyvisesh.com

(చదవండి: జస్ట్‌ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..! మరింత అందంగా ఇల్లు..)
 

#

Tags : 1

Videos

గంజాయి బ్యాచ్ అంటూ అబద్ధాలతో కుటుంబాన్ని అవమానించారు .. ఇప్పుడు ఈ చెల్లి పెళ్లి పరిస్థితి..

చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులు

భూమా అఖిలప్రియకు టీడీపీ నేతలు షాక్

RCB vs PBKS: ఈసాలా కప్‌ నమ్దూ.. నెరవేరిన ఆర్సీబీ క‌ల‌ (ఫోటోలు)

ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి

నేడు ఏపీవ్యాప్తంగా వెన్నుపోటు నిరసనలు

తెనాలి సాక్షిగా బయటపడ్డ.. జగన్ పై మరో భారీ కుట్ర

తెనాలి పోలీసుల పై వైఎస్ జగన్ ఆగ్రహం

తగ్గేదేలే .. క్షమాపణలు చెప్పేదేలే !

ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల

Photos

+5

'దేవిక & డానీ' ప్రెస్ మీట్.. అందంగా రీతూవర్మ (ఫొటోలు)

+5

దుబాయ్‌లో హీరోయిన్ సమంత సందడి.. (ఫోటోలు)

+5

కట్టిపడేసే కూర్గ్‌ అందాలు..తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!

+5

పెళ్లయి పదేళ్లు.. టాలీవుడ్ హీరోయిన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అండగా ఉంటా.. జాన్ విక్టర్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

+5

నీతో ప్రతీక్షణం అద్భుతమే : హబ్బీతో లవ్లీగా (ఫోటోలు)

+5

జగన్‌ రాకతో.. తెనాలిలో పోటెత్తిన అభిమానం (చిత్రాలు)

+5

బాబు వెన్నుపోటు: ఏపీలో తిండిగింజలకు పరేషాన్‌ (చిత్రాలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో లాంగ్‌ టూర్‌ ఎంజాయ్‌ చేస్తున్న అనసూయ (ఫొటోలు)