మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్
Breaking News
ఆగిన ధరలు: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!
Published on Wed, 05/28/2025 - 11:00
దేశంలో బంగారం దాగుడుమూతలాడుతున్నట్లు.. ఒకసారి తగ్గుతూ, మరోసారి తగ్గుతూ ఉన్నాయి. నేడు (మే 28) మాత్రం గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 89,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,480 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు స్థిరంగా ఉండిపోయాయి. కాబట్టి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు, నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగాయియు. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో పసిడి ధరలు వరుసగా రూ. 89,350 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 97480 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 89,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 97,600 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. మొత్తం మీద దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.
వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (బుధవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Tags : 1