Breaking News

రజినీకాంత్‌ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?

Published on Tue, 05/27/2025 - 20:05

రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్‌ కెరీర్‌లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్‌ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్‌ కెరీర్‌లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ ‍కనగరాజ్‌ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్‌, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్‌ రూ.375 పైగానే ఉండనుంది.

భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్‌ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా  తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)