బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..
Breaking News
స్పిరిట్ కంపెనీలో వివేక్ ఒబెరాయ్ పెట్టుబడి
Published on Fri, 05/23/2025 - 13:24
ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ స్కాటిష్ బ్రాండ్ రట్ ల్యాండ్ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో 21 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అందుకు ఎంతమేర డబ్బు వెచ్చించారనే విషయాలు వెల్లడికాలేదు. ఈ డీల్‌తోపాటు ఒబెరాయ్ ఎడిన్‌బర్గ్‌లో నెట్ జీరో ఉద్గారాలతో లగ్జరీ హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఐరోపాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత సౌకర్యాలతో భారతీయ వారసత్వం తలిపించేలా, స్కాటిష్ సంప్రదాయాలను మిళితం చేస్తూ ఎడిన్‌బర్గ్‌లో హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇది స్కాట్‌లాండ్‌లో తొలి ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌గా గుర్తింపు పొందనుందని అధికారులు చెబుతున్నారు. రట్‌లాండ్ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్ దాని టీఇన్‌ఫ్యూజ్డ్ జిన్ తయారీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఇదీ చదవండి: ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
ఈ సందర్భంగా పెట్టుబడుల గురించి ఒబెరాయ్ మాట్లాడుతూ.. భారతదేశం, స్కాట్‌లాండ్ మధ్య సంబంధాలను పెంపొందించడాన్ని హైలైట్ చేశారు. యూకేలో బలమైన భారతీయ వ్యాపార కమ్యూనిటీ ఉందని నొక్కి చెప్పారు. లోతైన ఆర్థిక, సాంస్కృతిక సహకారానికి ఇరు ప్రాంతాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Tags : 1