Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు
Breaking News
Hanuman Jayanti 2025 భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
Published on Fri, 05/23/2025 - 10:51
రాయదుర్గం: హనుమంతుడి జయంతిని ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి, గచ్చిబౌలోని శివసాయిక్షేత్రంలో ఆంజనేయస్వామికి, ఇందిరానగర్‌లోని ఇంటర్నేషనల్ శ్రీహనుమాన్ ధామ్ ఆశ్రమ్ ఆలయంలో, మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాం గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, టెలికామ్‌నగర్‌లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిõÙకాలు, అర్చనలు, ఆకుపూజ, ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలావుండగా గచ్చిబౌలిలోని శివసాయిక్షేత్రంలో హనుమాన్ హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ, వడమాలతో అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు.
మియాపూర్‌లో..
మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణనగర్‌కాలనీ, మియాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్ శ్రీకాంత్‌తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గాం«దీ, కార్పొరేటర్ శ్రీకాంత్‌ను సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

సుభాష్ చంద్రబోస్‌నగర్ కాలనీలో..
చందానగర్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్‌నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌యాదవ్, సాంబశివారావు, బృందరావు, అంకరావు, సత్యం, రామకృష్ణ, వెంకటేష్, రవి, అప్పలరాజు, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags : 1