Breaking News

భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు

Published on Fri, 05/23/2025 - 09:12

న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్‌ స్వాగత్‌’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్‌ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: బంగారం, స్టాక్‌ మార్కెట్‌, కరెన్సీ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌

అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.

ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)