Breaking News

భారత్‌పై బ్రూక్‌ఫీల్డ్‌ భారీ అంచనాలు

Published on Fri, 05/23/2025 - 05:31

ముంబై: న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే బ్రూక్‌ఫీల్డ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) వచ్చే మూడేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 100 బిలియన్‌ డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు సుమారు) చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ ఏయూఎం వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని సంస్థ ప్రెసిడెంట్‌ కానర్‌ టెస్కే తెలిపారు. 

ఇదే సమయంలో భారత్‌ తదితర వర్ధమాన మార్కెట్లలో వృద్ధి మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో బ్రూక్‌ఫీల్డ్‌ ప్రస్తుతం 30 బిలియన్‌ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులను మూడు లేదా నాలుగింతలు చేసుకోగలమన్న అంచనాతో ఉన్నట్టు టెస్కే చెప్పారు. భారత జీడీపీ వృద్ధి 5.5 శాతానికి పడిపోయినా తమ ఆస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. భారత్‌ మాదిరి ఆర్థిక వ్యవస్థకు అది మెరుగైన రేటే అవుతున్నారు.  

విలీనాలు.. కొనుగోళ్లు.. 
ప్రధానంగా విలీనాలు, కొనుగోళ్ల రూపంలో భారత్‌లోని తమ నిర్వహణ ఆస్తులు పెంచుకోనున్నట్టు కానర్‌ టెస్కే తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వ్యాపార వృద్ధిపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. భారత్‌ వేగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెబుతూ.. స్థిరమైన సరఫరా వ్యవస్థల కోసం చూసే కంపెనీలకు గమ్యస్థానం అవుతుందన్నారు. 

మౌలిక సదుపాయాలపై అధిక వ్యయాలు చేస్తుండడంతో ఈ రంగంలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పెట్టుబడులపై రాబడులు తమ అంచనాలకు అనుగుణంగా లేదా అంతకుమించే ఉన్నట్టు టెస్కే తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్‌ నిర్వహణ ఆస్తుల్లో 12 బిలియన్‌ డాలర్లు ఇన్‌ఫ్రాలో, మరో 12 బిలియన్‌ డాలర్నలు రియల్‌ ఎస్టేట్‌లో ఉండగా.. పునరుత్పాదక ఇంధన రంగంలో 3 బిలియన్‌ డాలర్లు, ప్రైవేటు ఈక్విటీలో 3.6 బిలియన్‌ డాలర్ల మేర నిర్వహిస్తోంది. యూఎస్‌ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానంతో భారత్‌కు ఎక్కువ ప్రయోజనకరమని టెస్కే అభిప్రాయపడ్డారు.

Videos

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)