73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
హోండా కొత్త స్కూటర్.. రూ.12 లక్షలు
Published on Thu, 05/22/2025 - 09:18
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎక్స్-ఎడివి మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ .11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లాగా ఉంటూ మరోవైపు స్కూటర్ లాంటి సౌకర్యం ఉండేలా ఈ మ్యాక్సీ స్కూటర్ ను రూపొందించినట్లు హోండా పేర్కొంది. ఎక్స్-ఏఏడీవీ మ్యాక్సీ స్కూటర్ కోసం హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్‌లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుండి ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.
హోండా ఎక్స్-ఏడీవీ ప్రత్యేకతలు
ఇంజిన్& పవర్ ట్రయిన్: హోండా ఎక్స్-ఏడీవీ 745 సీసీ లిక్విడ్-కూల్డ్ ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ పారలల్-ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6,750 ఆర్పీఎం వద్ద 57 బీహెచ్పీ శక్తిని, 4,750 ఆర్పీఎం వద్ద 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ & హార్డ్‌వేర్: అడ్వెంచర్ అప్పీల్ వచ్చేలా ఎక్స్-ఏడీవీ మొత్తం డిజైన్‌ను రూపకల్పన చేశారు. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ ఇచ్చారు. ముందు భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్, వెనుక భాగంలో 15-అంగుళాల స్పోక్ వీల్ ఉన్నాయి. సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో 41 ఎంఎం యూఎస్డీ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్ ముందు భాగంలో 296 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్‌తో సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి.

ఫీచర్లు: హోండా ఎక్స్-ఏడీవీలో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్టీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషషన్ , మ్యూజిక్, వాయిస్ కమాండ్ కంట్రోట్ వంటి ఫీచర్లున్న హోండా రోడ్ సింక్ యాప్‌ను ఈ స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి.
Tags : 1