73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
Published on Thu, 05/22/2025 - 08:02
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.
ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది.
Tags : 1