73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
మళ్లీ బంగారం రయ్..!
Published on Thu, 05/22/2025 - 07:20
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలతో పసిడికి మరోసారి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,910 పెరిగి రూ.98,450 స్థాయికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,870 లాభపడి రూ.98,000 స్థాయిని అందుకుంది.
‘‘బలహీన డాలర్ పసిడి ధరలకు మద్దతునిచ్చింది. యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేయడంతో సావరీన్ రిస్క్‌ను సైతం ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌తో దీర్ఘకాలంలో యూఎస్ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.
మరోవైపు వెండి ధరలకు సైతం కదలిక వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1,660 పెరిగి రూ.99,160 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,300 స్థాయిని దాటేసింది. స్పాట్ గోల్డ్ 22 డాలర్ల లాభంతో 3,312 డాలర్ల స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు అమెరికా ఆర్థిక ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలతో బంగారం 3,300 డాలర్లను తిరిగి అందుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
Tags : 1