రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్‌కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
Published on Sat, 05/17/2025 - 11:11
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్‌లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్‌నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్‌లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్‌సైజ్‌లతో మొదలుపెట్టి వర్కవుట్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు.
జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్‌బార్ డెడ్‌లిఫ్ట్‌లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్‌లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది.
‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్‌లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.
ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
డైట్ విషయానికి వస్తే...
‘ఎలాంటి రిస్ట్రిక్షన్‌లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.
ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్‌లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్‌లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
Tags : 1