బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
ప్రభుత్వం ఆదుకోకుంటే ’దివాలా’నే..
Published on Sat, 05/17/2025 - 10:28
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో మద్దతు లభించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత కార్యకలాపాలను కొనసాగించే పరిస్థితి ఉండదని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) వెల్లడించింది. ప్రభుత్వ మద్దతు, బ్యాంకుల నుంచి రుణాలు లభించక, పెట్టుబడులు పెట్టలేక, తమ సంస్థ (దివాలా పరిష్కార ప్రక్రియ కోసం) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొంది.
అలాంటి పరిస్థితే వస్తే స్వల్ప వ్యవధికైనా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన పక్షంలో నెట్‌వర్క్, స్పెక్ట్రం అసెట్స్ విలువ పడిపోతుందని టెలికం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. దీని వల్ల 20 కోట్ల మంది యూజర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలో ఏజీఆర్ బాకీలు, స్పెక్ట్రం బాకీల కేంద్రం కొంత సహాయం అందించాలని ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో మద్దతునిస్తే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్న 30,000 మందికి, 60 లక్షల మంది పైగా షేర్‌హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
Tags : 1