బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఐపీవోలు..
Published on Sat, 05/17/2025 - 08:04
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభంకానుంది. 23న ముగియనున్న ఇష్యూకి రూ. 85–90 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. 20న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 166 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 1,618 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. 2024 డిసెంబర్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,600 కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్రధానంగా ఆటో రంగంలోని సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్‌ను రూపొందించడంతోపాటు.. ఇత ర ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది.
బొరానా వీవ్స్
టెక్స్‌టైల్ తయారీ కంపెనీ బొరానా వీవ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. 22న ముగియనున్న ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా 67.08 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 145 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 19న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులను కొత్త తయారీ యూనిట్ ఫైనాన్స్ వ్యయాలతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని సూరత్ వద్ద ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా గ్రే ఫ్యాబ్రిక్‌ను ఉత్పత్తి చేయనుంది.
Tags : 1