Breaking News

ఉన్నదంతా ఇచ్చేస్తున్న జుకర్‌బర్గ్‌!

Published on Fri, 05/16/2025 - 20:10

ప్రపంచ కుబేరులు అపర దానకర్ణులుగా మారుతున్నారు. తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ మాతృసంస్థ టెక్‌ దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం.. మెటా సీఈవో తన సంపదలో 90 శాతానికి పైగా దానధర్మాలకు ఇచ్చేస్తున్నారు.

సుదీర్ఘకాలంగా పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న బిల్‌ గేట్స్ ఫార్చ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. జుకర్‌బర్గ్ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ను ఆయన తీవ్రమైన ఉద్దేశానికి సంకేతంగా పేర్కొన్నారు. జుకర్ బర్గ్ దాతృత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, "అతను చాలా మంచి ప్రారంభానికి వెళ్తున్నాడు" అని బిల్ గేట్స్ అన్నారు. తామిద్దరం తరచుగా దాతృత్వానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటామన్నారు.

మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ తమ జీవితకాలంలో 99 శాతం ఫేస్‌బుక్‌ షేర్లను విరాళంగా ఇస్తామని హామీ 2015లోనే ప్రకటించారు.
అప్పటి నుంచి వారి ఫౌండేషన్ విద్య, వైద్యం, సైన్స్ రంగాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తోంది.దాతృత్వ దృశ్యం ఎలా మారుతోందో గేట్స్ ఎత్తిచూపారు. వారెన్ బఫెట్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలిసి తాను 2010లో ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ద్వారా తమ సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికి ఇచ్చేందుకు టెక్ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Videos

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

అరెస్ట్ చేసే ముందు చెప్పండి బట్టలు సర్దుకుని రెడీగా ఉంటా

Ding Dong 2.0: కామిక్ షో

Athenna Crosby: 20 ఏళ్ల కిందటే నేను మిస్ వరల్డ్ కావాలని ఫిక్స్ అయ్యాను

చికెన్ దందా.. కమిషన్ కోసం కక్కుర్తి అఖిలప్రియపై ఫైర్

Ambati Rambabu: కేసులు పెట్టి వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతాం

మోదీ అందుకే చాక్లెట్ ఇచ్చారు పవన్ పై శ్యామల సెటైర్లు

Photos

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)