Breaking News

'టీ బ్యాగులు' తినడం గురించి విన్నారా..?

Published on Fri, 05/16/2025 - 14:41

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి. అది తినడం లేదా స్కిల్‌ పరంగా ఏదైనా.. ఆ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలానే ఇక్కడొక అమ్మాయికి ఉన్న విచిత్రమైన అలవాటు వింటే..ఇదేం అభిరుచి అనిపిస్తుంది.

సైప్రస్‌లోని లిమాసోల్‌కు చెందిన లియుబోవ్ సిరిక్‌ అనే 20 ఏళ్ల అమ్మాయికి ఓ వింత ఆహారపు అలవాటు ఉంది. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఈ అభిరుచి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 

'టీ' అంటే ఇష్టపడే ఆహార ప్రియులు ఆమె అలవాటు వింటే..వామ్మో అని నోరెళ్లబెడతారు. మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ అయిన లియుబోవ్‌కి టీ బ్యాగులు తినడం అంటే ఇష్టమట. టీ తాగిన తర్వాతా ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా మొత్తంగా తినేస్తుందట. ఇలా ఆమె రోజుకు రెండుసార్లు తినేస్తానని చెబుతోందామె. 

వారానికి కనీసం మూడుసార్లు పేపర్‌ టీ బ్యాగ్‌లు ఫినిష్‌ చేస్తానని అంటోంది. ఈ అలవాటు 14 ఏళ్ల  అప్పుడు ప్రారంభమైందట. వాళ్ల అమ్మమ్మ పుదీనా ఆకులు తినమని చెప్పినప్పుడూ ..ఈ టీ ఆకులు రుచి చూడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే టేస్ట్‌ నచ్చి..అది క్రమంగా అలవాటుగా మారిందని అంటోంది లియుబోవ్. 

ఆమె ఆర్గానిక్‌ టీ బ్యాగులను మాత్రమే తింటుందట. ప్లాస్టిక్ లేదా నైలాన్‌తో ఉన్న వాటిని టచ్‌ చేయనని చెబుతోంది. అయితే కొన్ని టీ బ్యాగుల్లో ఫాబ్రిక్ ఉంటుంది కాబట్టి తినడానికి కష్టంగా ఉంటుందని అంటోంది. అయితే ఆమె ఈ అలవాటుని వదిలేద్దాం అనుకుందట గానీ సాధ్యం కాలేదని చెబుతోంది. 

ఇది ప్రమాదకరమా..?
అయితే ఇదిప్రమాదకరమా అంటే..ఒక్కోసారి ఆ టీ వేస్ట్‌ గొంతులో అడ్డుపడటం లాంటిది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల వాదన. కానీ ఈ అమ్మాయి లియుబోవ్‌ మాత్రం ఈ అలవాటు మంచిదేనా? కాదా? అని గూగుల్‌లో సర్చ్‌ చేసిందట. చివరికి ఇది హానికరం కాదని నిర్థారించుకున్నాకే ధీమాగా తింటున్నానని చెబుతోంది. 

ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే  ఉన్నానంటోంది. ధూమపానం, మద్యం వంటి అలవాట్ల కంటే ప్రమాదకరమైనది కాకపోయినా..సాద్యమైనంత వరకు ఈ అలవాటుని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తానంటోంది. అయినా ఏ అలవాటుకైనా అడిక్ట్‌ అయ్యిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్‌' అని పెద్దలు ఊరికే అనలేదు కదా..! ఆరోగ్యానికి హానికరం కాకపోయినా..తగు జాగ్రత్తలో ఉండటమే మంచిది కదూ..!.

 

 

(చదవండి: 70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్‌నాథ్‌కు..! వీడియో వైరల్‌)

 

#

Tags : 1

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)