పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు
Breaking News
ఆర్‌బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
Published on Tue, 05/06/2025 - 00:23
ముంబై: పసిడిపై ఆర్‌బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్‌బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్‌బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది.
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్‌బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్‌బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు
పెంచుకుంది.

ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం..
ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.
Tags : 1