మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
అడవిలో థామా
Published on Tue, 05/06/2025 - 00:16
‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్‌లో జరుగుతోందట.
ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్– రష్మిక– నవాజుద్దీన్ సిద్ధిఖీలపై క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని బాలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్‌తో ‘థామా’ షూటింగ్ టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని సమాచారం. ఇక మడాక్ ఫిల్మ్స్(నిర్మాత దినేష్ విజన్) హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Tags : 1