కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
Published on Mon, 05/05/2025 - 18:50
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.
కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్‌పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్‌లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
Tags : 1