Breaking News

అరటి పండుతో అదిరేటి రుచులు

Published on Mon, 05/05/2025 - 17:21

వేసవి సెలవులొచ్చేశాయి. ఇక ఇంట్లో పిల్లల  సందడి మొదలవుతుంది. ఎండల్లో బాగా ఆడుకుంటారు. అందుకే పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం.  అలాగేఈ సమయంలో పిల్లలకి అన్ని పనులనూ మెల్లిగా అలవాటు చేయాలి కూడా. మరి  పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో  బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు కొన్ని వెరైటీలు చూద్దాం..


బనానా శాండ్‌విచ్‌
కావాల్సినవి: రెండు లేదా మూడు అరటిపళ్లు, పీనట్‌ బటర్‌-పావు కప్పు; కొన్ని బ్రెడ్‌ స్లైసెస్‌. 

తయారీ:  ముందుగా బ్రెడ్‌ స్లైసెస్‌ను ఓవెన్‌లో దోరగా వేయించుకోవాలి. ఈలోపు అరటి పండ్లను గుండ్రంగా కట్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పీనట్‌ బటర్‌ను బ్రెడ్‌ ముక్కలకు ఒకవైపు అప్లై చేసుకుని, రెండేసి బ్రెడ్‌ముక్కల్లో కొన్ని అరటిపండు ముక్కలను పెట్టుకుని, పైన పంచదార  పొడితో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

బనానా ఓట్‌ మీల్‌ బాల్స్‌ 
కావాల్సినవి: అరటిపండు-1 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); రోల్డ్‌ ఓట్స్‌ - అర కప్పు; పీనట్‌ బటర్‌-ఒక టేబుల్‌ స్పూన్‌; బెల్లం తురుము-కొద్దిగా; దాల్చినచెక్క పొడి -కొద్దిగా.

తయారీ:  ముందుగా ఒక పాత్రలో రోల్డ్‌ ఓట్స్, అరటిపండు గుజ్జు, పీనట్‌ బటర్, దాల్చిన చెక్క పొడి, బెల్లం తురుము ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్‌ పౌడర్‌ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని, కొద్దిగా కొబ్బరి కోరులో దొర్లించి సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

బనానా హనీ బైట్స్‌
కావాల్సినవి: అరటిపండ్లు – 2; తేనె – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు; దాల్చినచెక్క  పొడి – టీ స్పూన్‌
తయారీ: ముందుగా అరటిపండ్లను గుండ్రంగా కట్‌ చేసుకుని ఒక  పాత్రలోకి తీసుకోవాలి. అభిరుచిని బట్టి నెయ్యి లేదా బటర్‌లో దోరగా వేయించుకోవచ్చు. వేయించుకున్నా వేయించుకోకపోయినా వాటిపై తేనె, దాల్చినచెక్క పొడి వేసుకుని, కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బైట్స్‌.

చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

బనానా చాక్లెట్‌ పాప్స్‌
కావాల్సినవి: అరటిపండ్లు -4; ఐస్‌ క్రీమ్‌ పుల్లలు -6 పైనే; చాక్లెట్‌ చిప్స్‌- అర కప్పు (మెల్ట్‌ చేసుకోవాలి); డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు – కొన్ని (నచ్చినవి)

చదవండి: Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరి

తయారీ:  ముందుగా అరటిపండు తొక్క తీసి.. నచ్చిన విధంగా కట్‌ చేసుకుని.. ఒక్కో ముక్కకు ఒక్కో ఐస్‌ క్రీమ్‌ పుల్ల గుచ్చాలి. ఒక ప్లేట్‌లో పార్చ్‌మెంట్‌ పేపర్‌ వేసి అరటిపండు ముక్కలను దానిపై పేర్చి రెండు గంటల  పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు గట్టిపడిన తర్వాత కరిగిన చాక్లెట్‌లో ముంచి, వెంటనే తరిగిన డ్రై ఫ్రూట్స్‌ ముక్కలను పైన జల్లి సర్వ్‌ చేసుకోవచ్చు.

చదవండి : 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్‌ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)