మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
Published on Mon, 05/05/2025 - 16:23
కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.
ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది.
ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్‌కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.
ఇలా ఎందుకంటే..
స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట.
అంతేకాదండోయ్ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి.
అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.
(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్‌లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్ ఇదే..)
Tags : 1