మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
Breaking News
ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..
Published on Mon, 05/05/2025 - 11:45
మన టాలెంట్ మన కన్నవాళ్లకి తెలిసినట్టుగా మరెవరకి తెలియదు. మనల్ని మనం నమ్మకపోయినా..మన తల్లిదండ్రులకు మాత్రం అపార నమ్మకం ఉంటుంది. బహుశా ఆ ప్రేమే పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తుందేమో ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇక్కడొక తండ్రి తన కొడుకు టాలెంట్‌ని చూసి సంబరపడటమే కాదు సీక్రెట్‌గా రికార్డు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మనసుని టచ్ చేసే ఈ ఘటన ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ వీడియోలో ఓ బాలుడు మంచం మీద కూర్చొని హాయిగా పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఓ పక్కన బ్యాగులో పుస్తకాలు సద్దుతూ..పంజాబీ ఫేమస్ పాట “దో గల్లన్” పాడుతున్నట్లు కనపడుతుంది వీడియోలో. అతడు ఆ పాటని మైమరిచిపోయి పాడుతున్నాడు. పైగా లయబద్ధంగా అందంగా ఆలపించాడు.
దాన్ని మొత్తం అతడి తండ్రి తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేస్తూ. చివర్లో అది చూసి కొడుకు స్టన్ అయిపోతాడు. కాసేపటికి తేరుకుని ఏంటి నాన్న అంటూ మాట్లాడటంతో ముగిసిపోతుంది ఆ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది.
పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి..ప్రోత్సహించే పద్ధతి ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఏ చిన్నారులకైనా తమలోని టాలెంట్‌కి మొదటి విమర్శకులు తల్లిదండ్రులే..వారు స్పందించే తీరే ఆ రంగంలో పిల్లలు ఎదగడానికి, విజయం సాధించడానికి కారణమవుతుంది కదూ..!.
(చదవండి: రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ నంది వడ్డెమాన్‌గా..)
Tags : 1