కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి అభ్యర్థిపై భూ కబ్జా కేసు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి అభ్యర్థిపై భూ కబ్జా కేసు

Published Sat, Apr 20 2024 1:40 AM

-

ఇబ్రహీంపట్నం రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పేర్వాల గ్రామానికి చెందిన కంచర్ల రాధిక, ఆమె భర్త యాదగిరిరెడ్డి తుర్కయంజాల్‌ పరిధిలోని రాగన్నగూడ సర్వే నంబర్‌ 500, 501లోని ప్లాట్‌ నంబర్‌ 65లో 200 గజాల స్థలాన్ని 2015లో కొనుగోలు చేశారు. అప్పట్లోనే స్థలం హద్దుల మేరకు కడీలు పాతి వదిలేశారు. అయితే, ఫిబ్రవరి 17న కిరణ్‌కుమార్‌రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. రాధిక దంపతుల ప్లాట్‌తో పాటు దక్షిణం వైపున్న రోడ్డును ఆక్రమించి కాంపౌండ్‌ నిర్మించారు. తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరించారు. దీంతో సదరు మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ నెల 13న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement