బీజేపీకి అనుకూల వాతావరణం | Sakshi
Sakshi News home page

బీజేపీకి అనుకూల వాతావరణం

Published Sun, May 19 2024 8:05 AM

బీజేపీకి అనుకూల వాతావరణం

హన్మకొండ: బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ హంటర్‌ రోడ్డులోని సత్యం కన్వెన్షన్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, డి కన్వెన్షన్‌లో బీజేపీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు. ప్రశ్నించే గొంతుకై న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ బీజేపీ కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి ఓటు వేసే విధానంతో పాటు బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ పని చేస్తుందన్నారు. కేంద్ర ప్రఽభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తుంటే రాష్ట్రాలు వాటిని దారి మళ్ళిస్తున్నాయన్నారు. ఈక్రమంలో కేంద్రం నేరుగా విద్యార్థి ఖాతాలోనే ఉపకార వేతనాలు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వివరాలు పంపించలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.వేల కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్‌చార్జ్‌ రాంచందర్‌ రావు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఝెండల లక్ష్మీనారాయణ, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌, వన్నాల శ్రీరాములు, ఒంటేరు జయపాల్‌, జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్‌, ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్‌, ప్రొఫెసర్‌ ఆజ్మీర సీతారాం నాయక్‌, వరంగల్‌ పార్లమెంట్‌ ప్రభారి వి.మురళీధర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌ రెడ్డి, విద్యా సంస్థల ప్రతినిధులు బుచ్చిబాబు, అశోక్‌ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రేమేందర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement