రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం | Sakshi
Sakshi News home page

రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం

Published Sun, May 19 2024 8:05 AM

రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం

ములుగు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకునేలా చూడాలని సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో న్యాయపరమైన సలహాలు, సూచనల కోసమైనా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి సూచనలు పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కన్నోజు సునిల్‌కుమార్‌, న్యాయవాదులు మేకల మహేందర్‌, భిక్షపతి, బానోత్‌ స్వామిదాస్‌, రాజ్‌కుమార్‌, ప్రతాప్‌, సంజీవ్‌, మన్‌సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement