Mayagadu Telugu Movie Trailer Released Today - Sakshi
Sakshi News home page

Mayagadu Movie: 'నీ ప్రేమ కూడా పైరసీయే'.. ఆసక్తిగా ట్రైలర్

Published Mon, Jan 30 2023 9:18 PM

Mayagadu Telugu Movie Trailer Released Today - Sakshi

నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం 'మాయగాడు'. అడ్డా మూవీ ఫేమ్ జీ.ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  చిత్ర ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

కాగా.. అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత సినిమాల్లో నటించారు. ఇటీవలే బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేశ్. 

ఈ సినిమా ట్రైలర్ చూస్తే పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు. 

Advertisement
Advertisement