నేడు హైకోర్టు న్యాయమూర్తి రాక | Sakshi
Sakshi News home page

నేడు హైకోర్టు న్యాయమూర్తి రాక

Published Sat, Apr 20 2024 1:45 AM

వేలంలో పాల్గొన్న వ్యాపారులు - Sakshi

కరీంనగర్‌క్రైం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి వేణుగోపాల్‌ శనివారం కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 11.30గంటలకు మైసమ్మగూడ కొంపల్లిలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల 13వ గ్రాడ్యుయేషన్‌డేలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మంకమ్మతోటలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు కరీంనగర్‌లోని వెంకట్‌ ఫౌండేషన్‌ (బాలగోకులం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆదివారం మంకమ్మతోటలోని ఆయన నివాసంలో సివిల్‌ సర్వీసెస్‌–2023 ఫలితాలలో విజయం సాధించిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన నందాల సాయికిరణ్‌, కొలనుపాక సహనకు అభినందనలు తెలిపి, వారితో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు చింతకుంట లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగే ఒక వివాహానికి హాజరై అనంతరం హైదరాబాద్‌ వెళ్తారు.

ధాన్యం కొనుగోళ్లపై నజర్‌

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం

కరీంనగర్‌ అర్బన్‌: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రత్యేక అధికారులను నియమించారు. మందకొడిగా కొనుగోళ్లు సాగుతుండటం.. మేఘాలు కమ్ముకోవడంతో అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో చర్యలను ముమ్మరం చేశారు. జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా డీసీ ఎంఎస్‌, ప్యాక్స్‌, ఐకేపీ, హకా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో 4.50లక్షల మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటికి కొనుగోలు చేసింది అరకొరే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. డీఆర్డీవో వి.శ్రీధర్‌కు గంగాధర, రామడుగు మండలాలు కేటాయించగా జిల్లా పౌరసరఫరాల అధికారి యం.గౌరీశంకర్‌కు హుజూరాబాద్‌, శంకరపట్నం, పౌరసరఫ రాల సంస్థ డీఎం ఎం.రజినీకాంత్‌కు తిమ్మాపూర్‌, మానకొండూరు, జిల్లా మార్కెటింగ్‌ అధి కారి యం.పద్మావతికి కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌, చొప్పదండి, జిల్లా వ్యవసాయ అధి కారి బి.శ్రీనివాస్‌కు గన్నేరువరం, చిగురుమామిడి, ఎస్‌.రామానుజచార్యను సైదాపూర్‌, వీణవంక, డీసీయంఎస్‌ ఆర్‌.వెంకటేశ్వర్‌రావు ను ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,350

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర రూ.7,350 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 43 వాహనాల్లో 565 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు మోడల్‌ ధర రూ.7,250, కనిష్ట ధర రూ.6,800 పలికింది. గన్నీ సంచుల్లో ఏడుగురు రైతులు ఆరు క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,000, మోడల్‌ ధర రూ.5,500, కనిష్ట ధర రూ.5,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌కు శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని కార్యదర్శి గుగులోతు రెడ్డినాయక్‌ పేర్కొన్నారు.

ఎస్సీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థికి నాలుగు ఉద్యోగాలు

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 2019 బ్యాచ్‌కు చెందిన గొర్రె కార్తీక్‌ యూ నియన్‌ బ్యాంకు కరీంనగర్‌లో ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీవో)గా ఎంపికై , అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారని స్టడీ సర్కి ల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. ఆయన ఐబీపీఎస్‌ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌లో క్లర్క్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఆఫీస్‌ అసిస్టెంట్‌, కరీంనగర్‌ డీసీసీబీలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలూ సాధించాడన్నారు. కార్తీక్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నతా నియేల్‌, స్టడీ సర్కిల్‌ స్టాఫ్‌, అధ్యాపకులు అభినందించారు. కరీంనగర్‌ బ్రాంచి నుంచి ఇప్పటివరకు 9 బ్యాచ్‌లలో 900 మందికి ఉచిత శిక్షణ ఇవ్వగా 224 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్‌ పేర్కొన్నారు.

కార్తీక్‌
1/2

కార్తీక్‌

జస్టిస్‌ 
ఇ.వి.వేణుగోపాల్‌
2/2

జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌

Advertisement
Advertisement