ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు

Published Mon, Feb 12 2024 6:31 AM

Equity mutual fund inflow hits almost 2-year high of Rs 21,780-crore in January - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్, థీమ్యాటిక్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్‌ ఫండ్స్‌ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్‌ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది.

చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్‌ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్‌ నెలలో వచి్చన సిప్‌ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది.

కొత్తగా 51.84 లక్షల సిప్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్‌ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్‌ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్‌ లీలాధర్‌’ ఇన్వెస్ట్‌మెంట్‌ సరీ్వసెస్‌ హెడ్‌ పంకజ్‌ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా అనలిస్ట్‌ మెలి్వన్‌ శాంటారియా తెలిపారు.  

విభాగాల వారీగా..
► థీమ్యాటిక్‌ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది.
► మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి.  
► లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్‌ నెలలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం.  
► డెట్‌ ఫండ్స్‌ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్‌ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం.
► డెట్‌ విభాగంలో అత్యధికంగా లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
► గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.   
► మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్‌లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది.  
► మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్‌ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది.


బంగారంలో హెడ్జింగ్‌..
‘‘మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ 15 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్‌ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్‌ శాంటారియా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement