స్ట్రాంగ్‌ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ

Published Tue, May 21 2024 6:05 AM

స్ట్రాంగ్‌ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ

ఎచ్చెర్ల క్యాంపస్‌: చిలకపాలేంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్పీ జీఆర్‌ రాధిక సోమవారం పరిశీలించారు. మూడంచెల భద్రత 18 స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సెక్యూరిటీ పరిశీలించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత సిబ్బందికి సూచించారు. కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన చర్యలు, భద్రతపై పోలీస్‌ అధికారులతో చర్చించారు. కౌంటింగ్‌ రోజు రోడ్లు, కళాశాల ఆవరణలో ఇతరులు ఉండకుండా జాగ్రత్త పడాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి శాంతి భద్రతలు సమస్య లేకుండా పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఏఎస్పీ ప్రేమ్‌కాజల్‌, డీఎస్పీ శృతి, సీఐ జి.రామచంద్రరావు, ఎస్సై ఎస్‌.చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement