లూజు పెట్రోల్‌ విక్రయించరాదు | Sakshi
Sakshi News home page

లూజు పెట్రోల్‌ విక్రయించరాదు

Published Tue, May 21 2024 6:05 AM

లూజు పెట్రోల్‌ విక్రయించరాదు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కౌంటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ రోజున పటిష్టమైన భద్రత ఉండాలన్నారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ చాంబర్‌లో ఎస్పీ జీఆర్‌ రాధికతో కలిసి సో మవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు కొనసాగించాలన్నారు. జిల్లాలో ఉన్న 120 పెట్రోల్‌ బంకుల నుంచి లూజు పెట్రోల్‌ విక్ర యాలు చేయకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని డీఎస్‌ఓ బి.శాంతిశ్రీని ఆదేశించారు. జిల్లాలో పండుగలు జరుపుకునే ప్రాంతాల్లో సమూహాలుగా ఉండరాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మందుగుండు సామగ్రి (క్రేకర్లు) విక్రయించకుండా లైసెన్సులు కలిగిన యజమానులకు నోటీసులు జారీ చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో టెక్క లి రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అదనపు ఎస్పీ ప్రేమ్‌ కాజల్‌, సెబ్‌ అదనపు ఎస్పీ గంగాధరం, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు డాక్టర్‌ భరత్‌ నాయక్‌, సీహెచ్‌ రంగయ్య, అప్పారావు, లక్ష్మణమూర్తి, సుదర్శన్‌ దొర, రామ్మోహనరావు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement