24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్‌ మేళా | Sakshi
Sakshi News home page

24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్‌ మేళా

Published Tue, May 21 2024 6:05 AM

24న ఎ

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 24వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌.సుధాకరరావు తెలిపారు. ఎచ్చెర్ల ఐటీఐలో సోమ వారం వివరాలు వెల్లడించారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 13 ప్రైవేటు కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయని వివరించారు. నెల్లూరుకు చెందిన అల్‌స్టోం, సుజు మోటార్స్‌, ఇన్‌ప్లూమ్‌, డికో, ఏసెన్‌, అనంతపురానికి చెందిన హ్యుందాయ్‌, ఏసీటీ, కెఐఎంఎల్‌, కేఎస్‌హెచ్‌, డీఎస్‌, సోయన్‌, సాంగో తిరుపతికి చెందిన డిక్సన్‌ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. మొత్తం 550 ఉద్యోగాల వరకు కల్పిస్తారని అన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. రూ.15 వేల నుంచి రూ. 18 వేల వరకు నెల వారీ వేతనం ఉంటుందని అన్నారు. 10వ తరగతి, కుల ధ్రువీకరణ ప త్రం, ఆధార్‌ కార్డులతో హాజరు కావాలని అన్నారు. ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలు, రెండు బయోడేటా పత్రాలుతో హాజరు కావాలని సూచించారు. ఫోన్‌ నంబర్లు 9959353636, 6304033963 సంప్రదించాలని సూచించారు.

‘ప్రత్యేక అవసరాల పిల్లలపై దృష్టి’

జలుమూరు: ప్రత్యేక అవసరాల గల పిల్లలపై దృష్టి సారిస్తున్నామని జిల్లా సహిత విద్యా విభాగం కో ఆర్డినేటర్‌ బుడుమూరు గోవిందరావు తెలిపారు. ఆయన సోమవారం జలుమూరు మండలంలోని పలు గ్రామాల్లో ది వ్యాంగ పిల్లల సర్వే నిర్వహించారు. బడి బయట ఉన్న 0 నుంచి 18 ఏళ్ల లోపు దివ్యాంగ విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించి వాళ్లకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాల ని సూచించారు. ఆయనతో పాటు విద్య సహా కో ఆర్డినేటర్‌ ఉమా మహేశ్వరి, రమేష్‌, కృష్ణ ప్రసాద్‌ తదితరులున్నారు.

ఆదివాసీల క్రికెట్‌

టోర్నమెంట్‌ ప్రారంభం

సారవకోట: మండలంలోని గొర్రిబంద పంచాయతీ జగన్నాథపురం గిరిజన గ్రామంలో సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగేశ్వరరావు క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. గిరిజన గ్రామా ల్లోని యువత క్రీడల్లో రాణించేందుకు ఈ టో ర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా నుంచి 36 జట్లు పాల్గొననున్నాయని తొలి మ్యాచ్‌ జగన్నాథపురం, బురుజువాడ టీంల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు.

‘క్రీడలతో గుర్తింపు సాధ్యం’

శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, గుర్తింపు క్రీడలు, కళలతోనే సాధ్యపడుతుందని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసో సియేషన్‌ చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ క్రీడామైదానం వేదికగా జరుగుతున్న జిల్లా యూత్‌ బా ల బాలికల బాస్కెట్‌బాల్‌ జట్ల శిక్షణ శిబిరాల్లో రాణించిన క్రీడాకారుల తుది జట్లను సోమ వారం ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు విజయవాడ వేదికగా జరిగే 7వ ఏపీ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా జట్లు జిల్లా కేంద్రం నుంచి పయనమై వెళ్లాయి. వీరికి రానుపోను ఖర్చుల కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెస్సార్‌ అందజేశారు. క్రమశిక్షణగా ఆడి తుది వరకు పోరాడాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు. క్రీడ ల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు, సంఘానికి గౌరవాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యనిర్వహక కార్యదర్శి, డీఎస్‌ఏ కోచ్‌ జి.అర్జున్‌రావురెడ్డి, సంఘ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్‌ మేళా
1/1

24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్‌ మేళా

Advertisement
 
Advertisement
 
Advertisement