తగ్గని ఎన్నికల వేడి | Sakshi
Sakshi News home page

తగ్గని ఎన్నికల వేడి

Published Tue, May 21 2024 6:00 AM

తగ్గన

శ్రీకాకుళం
భూసారం పెంచుదాంభూసారం పెంచడానికి పచ్చిరొట్ట చక్కటి మార్గం. ఈ విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నారు. –8లో

మంగళవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2024

ఎడతెగని విశ్లేషణలు

పోలింగ్‌ ముసిగిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు, వారి అనుయాయులు బూత్‌ల వారీగా పోలింగ్‌ సరళిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏయే కేంద్రాల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అక్కడెలా ఓటింగ్‌ జరిగింది. వాటిలో తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి, తమ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఓటర్లు ఎవరికి ఓటేశారని కూలంకషంగా లెక్క లు వేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ బూత్‌ల్లో 40శాతం తక్కువ కాకుండా ఓటింగ్‌ జరిగింది. 60 నుంచి 70 శాతం, 70 నుంచి 80 శాతం, 80 నుంచి 90 శాతం పోలింగ్‌ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ పర్సంటేజీల్లోనే ఎక్కువ ఓటింగ్‌ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా పోలింగ్‌ బూత్‌ల్లో అనుకూలంగా వచ్చే ఓట్లు ఎన్ని, ప్రతికూలంగా ఓట్లు ఎన్ని ఆరా తీస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా వచ్చే వివరాలతో అనుకూలంగా వస్తే హమ్మయ్యా అని సంతోష పడుతున్నారు. ప్రతికూలంగా వస్తే అయ్యో దెబ్బ కొట్టినట్టు ఉందే అని ఉసూరుమంటున్నారు. అభ్య ర్థులంతా లెక్కల బిజీలో ఉంటే పబ్లిక్‌లో మా త్రం ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. వివిధ సంస్థలు చేసే పోలింగ్‌ అనంతరం స్టడీలు, సోషల్‌ మీడియాలోని విశ్లేషణలపై చర్చించుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

టింగ్‌ ముగిసి వారమైపోయింది. అయినా గ్రామాల్లో ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. ఫలితాలపై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఓట్ల లెక్కింపునకు మరో 14రోజులు ఉండటంతో ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందోనని అంతా లెక్కలేసుకుంటున్నారు. గతసారి ఎన్నికల కంటే ఈసారి పోలింగ్‌ శాతం పెరగడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని అంచనాలు వే సుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు పందెం రాయళ్లు కూడా బరిలోకి దిగారు. ఎక్కడెక్కడి నుంచో ఐవీఆర్‌ఎస్‌ మాదిరిగా ఫోన్‌ కాల్‌ చేసి ఎవరికి ఓటేశారు? ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? అని ఓటర్లను అడుగుతున్నారు. కానీ ఈ కాల్స్‌కు విసుగెత్తిపోయి చాలామంది కట్‌ చేసేస్తున్నారు. దీంతో పందెం రాయళ్లకు కూడా జనం నాడి అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.

ఫోన్‌ సర్వేల్లో పందెం రాయళ్లు

ఎన్నికలు వస్తే చాలు పందెంరాయళ్లు బరిలోకి దిగుతారు. ఒకవైపు ఐపీఎల్‌ క్రికెట్‌ పందేలు జోరుగా జరుగుతుండగా.. అదే స్థాయిలో ఎన్నికల ఫలితాలపై పందేలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎవరివైపు పందెం కాస్తే బాగుంటుందనే దానిపై ఐవీఆర్‌ఎస్‌ మాదిరిగా ఓటర్లకు ఫోన్‌ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు ఫోన్‌ ద్వారా సర్వే చేశాయి. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ తాను అనుకుంటున్న వాళ్లకి, వ్యతిరేకిస్తున్న వారికి ఆ అభిప్రాయ సేకరణ చూపించి అభ్యర్థుల ఎంపిక ప్రహసనం పూర్తి చేశా రు. ఇక, ప్రచార సమయంలోనైతే ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజల్ని పెద్ద ఎత్తున విసుగెత్తించారు. కాల్స్‌ చేయడం, చెప్పింది వినాలని కోరడం, తమ పథకాలను ప్రచారం, వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేయడం వంటివి పెద్ద ఎత్తున చేశారు. ఈ కాల్స్‌ లిఫ్ట్‌ చేయలేక ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. పోలింగ్‌తో ఈ కాల్స్‌ తగ్గాయనుకుంటే పందేం రాయళ్లు కాల్స్‌ రావడం ప్రారంభమయ్యాయి.

కాల్స్‌ కట్‌ చేస్తున్న ప్రజలు

ఐవీఆర్‌ఎస్‌ మాదిరి కా ల్స్‌కు విసుగెత్తిన ప్రజలు పందెం రాయళ్లు చేసే కాల్స్‌కు, గెలుపు అంచనాలను తెలుసుకునేందుకు వివిధ సంస్థలు చేసే కాల్స్‌కు ప్రజలు పెద్దగా సహకరించడం లేదు. మీరు ఏ పార్టీకి ఓటు వేశారు, ఎమ్మెల్యే ఓటు ఎవరికేశారు, ఎంపీ ఓటు ఎవరికి వేశారు అని అడుగుతూ అందుకు చెప్పిన అంకెలు నొక్కండి అంటూ కాల్‌లో విసిగిస్తున్నారు. వీటికి అతి కొద్దిమంది మాత్రమే స్పందిస్తున్నారు. చాలా మంది ఆ పశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాల్‌ కట్‌ చేసేస్తున్నారు. దీంతో ఆయా పందేం రాయళ్లకు, స్టడీ సంస్థలకు జనం నాడి చిక్కని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి అటు అభ్యర్థులకు, ఇటు పందేం కాసే వారికి, మరోవైపు ఫోన్‌ సర్వేపై ఆధారపడి చేసే స్టడీ సంస్థలకు స్పష్టత రావడం లేదు.

న్యూస్‌రీల్‌

ఓటింగ్‌ సరళిపై విశ్లేషించుకుంటున్న నాయకులు

సోషల్‌ మీడియా విశ్లేషణలను

చర్చించుకుంటున్న ప్రజలు

జనం నాడి కోసం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తున్న పందెంరాయుళ్లు

స్పష్టత రాక గింజుకుంటున్న ఆసక్తిదారులు

తగ్గని ఎన్నికల వేడి
1/2

తగ్గని ఎన్నికల వేడి

తగ్గని ఎన్నికల వేడి
2/2

తగ్గని ఎన్నికల వేడి

Advertisement
 
Advertisement
 
Advertisement