ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Published Tue, May 21 2024 6:00 AM

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

పాతపట్నం: మండలంలోని కొదూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పాతూరు గోవిందరావు (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొ దూరు గ్రామానికి చెందిన గోవిందరావు ట్రాక్టర్‌ నడుపుతూ ఉండేవాడు. ఇటీవల ప్రతి రోజు మద్యం తాగుతూ రాత్రి ఇంటికి వస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య వనిత అడగడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గోవిందరావు ఇంట్లో ఒక గదిలోకి వెళ్లి, క్షణికావేశంతో ఇంట్లో ఉన్న స్లాబ్‌ డూమ్‌కు ఉరి వేసుకున్నాడు. రాత్రి 10.30 గంటల తర్వాత గోవిందరావు చెల్లి ధనశ్రీ అన్నయ్యకు భోజనం కోసం గదిలోకి వెళ్లగా ఆయన ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు గోవిందరావును కిందకు దించి ఆటోలో పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలియజేశారు. సోమవారం వైద్యులు ష ణ్ముఖరావు మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గోవిందరావుకు కుమా ర్తె ధర్మిణి, కుమారుడు అభిరామ్‌లు ఉన్నారు. తల్లి పాతూరు చిన్నమ్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహమ్మద్‌ యాసీన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement