‘కేసీఆర్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు’

Published Thu, Mar 9 2017 5:43 PM

‘కేసీఆర్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు’ - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల కనీస హక్కులను సీఎం కేసీఆర్‌ కాలరాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరసనలను నిషేధించారని తెలిపారు.

ఫిబ్రవరి 22వ తేదీన టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం తదితరులు ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందరినీ అరెస్టు చేసి ఆందోళనను భగ్నం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీజేఏసీ కీలకభూమిక పోషించిందని వివరించారు.

ఇందిరాపార్కు వద్ద వివిధ దశల్లో చేపట్టిన ఆందోళన కారణంగానే రాష్ట్ర సాధన సాధ్యమైందని, అనంతరం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌.. ఇప్పుడు నిరసనలను సహించలేకపోతున్నారని చెప్పారు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించటానికి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలను తీసుకోలేదని, దీనిపై చేపట్టే ఆందోళనలను ఆయన అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం పాల్పడే అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని నారాయణ చెప్పారు.
 

Advertisement
 
Advertisement