తన తాజాచిత్రం‘ఖూబ్సూరత్’ను దివంగత నిర్మాత హృషికేష్ ముఖర్జీకి అంకితం చేస్తున్నానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పేర్కొంది. 1980లో హృషికేష్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’ సినిమా తీశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో విడుదలైన సినిమాలో సోనమ్ నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ కథానాయకుడిగా నటించాడు. ‘ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర కాదు. ప్రతి సినిమాకి నిర్మాత, దర్శకుడు, రచయితలే కథానాయకులనేది నా భావన. ఏ సినిమా హిట్ అయినా ఆ గొప్పదనాన్ని నా ఖాతాలో వేసుకోను. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద అది బోల్తాపడినా ఆ నింద నాపై మోపవద్దు. సినిమా అనేది ఉమ్మడి కృషి.
అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది’ అని అంది. ఈ సినిమా మీ సొంత బ్యానర్‌పై విడుదలైనందువల్ల ముందుజాగ్రత్తలేమైనా తీసుకున్నారా అని అడగ్గా ఒక వస్తువును మార్కెట్లోకి విడుదల చేసేముందు దానిపై మనకు సంపూర్ణ విశ్వాసముండాలంది. హృషికేశ్ ఇప్పటికీ బతికిఉండి ఈ సినిమా చూసినట్టయితే సంతోషించేవాడేమో కదా అని అడగ్గా ఒకవేళ ఆయన కనుక ఈ సినిమాను చూసినట్టయితే తనకు ఇబ్బందిగా అనిపించేదేమో అంది. హృషికేష్ తీసిన ఈ సినిమాని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని మీకు ఎందుకనిపించిందని ప్రశ్నించగా అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని తెలిపింది. ఈ సినిమాని ఆ మహానుభావుడికే ఎంతో ప్రేమతో అంకితం చేస్తున్నానని చెప్పింది. మీ భవిష్య ప్రణాళికలేమిటని అడగ్గా ఈ నెల 21వ తేదీనుంచే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ ప్రారంభించామంది. తన సోదరి రేహా కూడా మరో సినిమా తీస్తోందని తెలిపింది.
హృషికేష్‌జీకి అంకితం చేస్తున్నా
Published Sat, Sep 20 2014 10:59 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement