రోజర్స్‌ కప్‌ సెమీఫైనల్లో రాఫెల్‌ నాదల్‌  | Sakshi
Sakshi News home page

రోజర్స్‌ కప్‌ సెమీఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ 

Published Sun, Aug 12 2018 2:10 AM

Rafael Nadal confirms return to London after Marin Cilic win - Sakshi

హార్డ్‌ కోర్టులపై ఐదేళ్లుగా ఊరిస్తోన్న ఏటీపీ మాస్టర్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించే దిశగా రాఫెల్‌ నాదల్‌ ముందంజ వేశాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతోన్న రోజర్స్‌ కప్‌ టోర్నీలో ఈ స్పెయిన్‌ స్టార్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 2–6, 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్‌ టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు వరుసగా 14వ ఏడాది అర్హత సాధించాడు.    

Advertisement
 
Advertisement