ప్రేమ వివాహం చేసుకుందని.. - | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం చేసుకుందని..

Published Wed, May 22 2024 10:50 AM

-

శాయంపేట : ఫిర్యాదు చేసిన గంట సమయంలోపే కిడ్నాప్‌ కేసును శాయంపేట పోలీసులు ఛేదించారు. ఎస్సై ప్రమోద్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన ముకుంట్ల తరుణ్‌ రెండు నెలల క్రితం హనుమకొండ పట్టణంలోని పెగడపల్లికి చెందిన ఆకుల బిందును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బిందు తల్లి ఆకుల కవిత, అమ్మమ్మ అన్యం విజయ, మరో ముగ్గురు ఆటోలో ప్రగతిసింగారం గ్రామానికి వచ్చారు. తరుణ్‌ లేని సమయంలో బిందును బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న అరుణ్‌ తన భార్యను కిడ్నాప్‌ చేశారని శాయంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ప్రమోద్‌కుమార్‌ కేసు నమోదు చేసి ఫిర్యాదు ఇచ్చిన గంటలోపే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నిందితులను పట్టుకొని బిందును భర్త తరుణ్‌కు అప్పగించారు. నిందితులను త్వరితగతిన పట్టుకున్న ఎస్సై ప్రమోద్‌కుమార్‌, కానిస్టేబుల్‌ సాధన్‌, నాగరాజును పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్‌, శాయంపేట సీఐ రంజిత్‌రావు అభినందించారు.

ప్రగతిసింగారంలో కూతురిని

కిడ్నాప్‌ చేసిన తల్లి

ఫిర్యాదు చేసిన గంటలోపే

ఛేదించిన పోలీసులు

టెక్నాలజీ సాయంతో నిందితుల అరెస్ట్‌

అభినందించిన పరకాల ఏసీపీ

కిశోర్‌కుమార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement