లంచం ఇవ్వలేదని మహిళకు నిప్పు | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వలేదని మహిళకు నిప్పు

Published Tue, Jul 7 2015 9:07 AM

లంచం ఇవ్వలేదని మహిళకు నిప్పు

బారాబంకి: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బారాబంకి పోలీస్ స్టేషన్ వద్ద  జర్నలిస్టు తల్లికి నిప్పంటించారు. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వనందుకు ఇద్దరు పోలీసులు తనను అవమానించి, వేధించి, నిప్పుపెట్టారని చనిపోయేముందు బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా బాధితురాలే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


పోలీసులు ఓ కేసుకు సంబంధించి రామ్ నారాయణ్ అనే వ్యక్తిని  స్టేషన్కు తీసుకెళ్లారు. ఆయనను విడిపించుకునేందు కోసం భార్య నీతూ ద్వివేది పోలీస్ స్టేషన్కు వెళ్లింది. రామ్ నారాయణ్ను విడిచిపెట్టేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని నీతూ చెప్పింది. లంచం ఇవ్వనందుకు తనను తీవ్రంగా వేధించి నిప్పు పెట్టారని తెలిపింది. తీవ్రంగా గాయపడిన నీతూను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కాగా పోలీసులు మాత్రం భాదితురాలే స్టేషన్ గేట్ వద్ద నిప్పుపెట్టుకుందని తెలిపారు.
 

Advertisement
Advertisement