ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..? | Sakshi
Sakshi News home page

ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..?

Published Sun, Jun 26 2016 12:18 PM

ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..?

మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సినిమా ఒక మనసు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. దీంతో పరభాష నటులు ఇప్పుడు ఈ సినిమా రీమేక్ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే తమిళ ప్రేక్షకుల కోసం ఒక మనసు సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఓ స్టార్ హీరో.

ఇటీవల ఒక మనసు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తమిళ హీరో ధనుష్, ఆ సినిమాను తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు ఒక మనసు సినిమా దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ముఖ్యంగా నాగశౌర్య పాత్ర, నేపథ్యం.. నచ్చిన ధనుష్ తానే స్వయంగా ఆ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement