
బన్నీ, నానిలంటే ఇష్టం : సీనియర్ హీరో
తన సక్సెస్ల గురించే కాదు.. ఫెయిల్యూర్స్ గురించి కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం సీనియర్ నటుడు జగపతి బాబుకు
తన సక్సెస్ల గురించే కాదు.. ఫెయిల్యూర్స్ గురించి కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం సీనియర్ నటుడు జగపతి బాబుకు అలవాటు. తాజాగా పటేల్ సర్ సినిమాతో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీనియర్ హీరో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన నటుల గురించి అడిగిన ప్రశ్నకు జగ్గుభాయ్ చెప్పి సమాధానం ఆకట్టుకుంది.
ఈ జనరేషన్ లో తనకు బాగా నచ్చిన హీరో అల్లు అర్జున్ అని చెప్పిన జగ్గుభాయ్, బన్నీ అంటే ఎందుకు ఇష్టమో కూడా క్లారిటీ ఇచ్చాడు. బన్నీ మెగా ఇమేజ్ కు దూరంగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడని, బన్నీయాక్టింగ్, డ్యాన్స్, కష్టపడే తత్వం తనకు ఇష్టమన్నాడు. ఆ తరువాత నాని అంటే కూడా తనకు ఇష్టమని తెలిపాడు. అయితే ఇద్దరితో జగపతి బాబు ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయకపోవటం విశేషం.